Tuesday, March 28, 2023

                                                              PAGE -2

       జ్ఞాన పాన [CONTINUED] :-

           భక్త కవి [కొందరు మహాకవి అని కూడా సంబోధిస్తారు ]పూంధానం నంబూదిరి 16 వ శతాబ్దంలో ,మలయాళ భాషలో రచించిన లఘు భక్తి కావ్యం జ్ఞాన పాన .పాన అనేది మలయాళ భాషలోని ఒక్క ఛందస్సు .జ్ఞానం [అధ్యాత్మికజ్ఞానం ]గురించి ,పాన అనే  ఛందస్సులో రచించిన కావ్యం జ్ఞాన పాన మలయాళ భక్తి సాహిత్యంలో, ఈ

కవికి   ముఖ్యమైన,సుస్థిరమైన స్థానం ఉంది .కుమారాపహరణం ,భాషాకర్ణామృతం పార్థసారదీ స్తవం ,మొదలైనవి ఈ కవి తాలూకు ఇతర రచనలు .

  అతి సరళమైన భాషలో ,అలంకారాల ప్రౌఢి  ఎక్కువ లేకుండా ,ఈ కావ్యాన్ని రచించారు పూంధానం .అలనాటి వ్యావహారిక మలయాళ భాషలో లయ బద్ధంగా రచించారు .భక్తి భావం ప్రజల్లోకి  వెళ్లాలనేది కవి ఉద్దేశ్యం .అనువాదం కూడా అంతే సరళంగా లయబద్దంగా ఉండడానికి వీలున్నంతవరకు ప్రయత్నించాను .ఈ భక్తి కావ్యాన్ని తెలుగులోకి అనువాదం చేయమని కోరిన చెన్నై అయ్యప్ప  భక్త సమాజానికి ధన్యవాదాలు ---

                                                                                                 ఎల్ .ఆర్ .స్వామి .

                                                                        కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార  గ్రహీత;9949075859

     ఎల్ .ఆర్ .స్వామి :-  అనువాదకులు శ్రీ ఎల్ .ఆర్ .స్వామి కేరళ లో పుట్టి పెరిగి ,మలయాళం మాధ్యమం లో     చదువుకున్న తమిళుడు .విద్యార్థి దశలో వున్నప్పుడు  మలయాళం లో రచనలు చేసి బహుమతులు అందుకున్నవారు ఉద్యోగ రీత్యా విశాఖ వచ్చి స్థిరపడిన తరువాత ,స్వయంగా  తెలుగు భాష నేర్చుకుని తెలుగు సాహిత్యం చదివారు .తెలుగులో 200 వరకు కధలు ప్రచురిత మైనాయి .బహుమతులు వచ్చాయి .6 కధా సంపుటాలు ప్రచురితమైనాయి .గత వందేళ్ల కాలంలో తెలుగులో వచ్చిన 100 మేటి కధలను ఎన్నుకున్నప్పుడు ఇతని కధ కూడా వాట్లో ఒకటిగా ఎన్నుకోబడింది 2015 లో తెలుగులోకి అనువాదం చేసినందుకు గాను కేంద్ర సాహిత్య అకాడెమీ వారి అనువాద  పురస్కారం అందుకున్నారు .ఈ రోజుకి అంటే 28--3-2023నాటికి తెలుగులోకి 44 పుస్తకాలు మలయాళం లోకి తెలుగు నుంచి 20 పుస్తకాలు అనువాదం చేసేరు .విశాఖ లోని గీతం  యూనివేర్సిటీ ఇతనికి గౌరవ డాక్టరేట్ [D.Lit] ఇచ్చి సత్కరించింది .ఇతని కధల మీద ఆంధ్ర యూనివేర్సిటీ లో విధ్యార్థి P.hd.మరియు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివేర్సిటీ లో M.Philపట్టాలు పుచ్చుకున్నారు  

.

 

                                                                                                                                                                                              ;

 


 

No comments:

Post a Comment