Tuesday, August 14, 2012

COLLEGUE ANTE

                                                కోలీగ్  అంటే

ఎ .సి .గదిలో కూర్చున్నా ,ముచ్చేమటలు పోసాయి నాకు .వంగి చేతిరుమాలుతో ముఖం వత్తుకొని తలెత్తి చూసాను .మా కర్మాగారంలో నిర్విరామంగా వెలిగే మంటకన్నా ఎర్రగా వున్నాయి మా జి .ఎం .గారి కళ్ళు ." ఛీ ఛీ ఎం పాడు పని చేసారండి"
జి .ఎం .విసుక్కున్నారు ."వచ్చిన ఉద్యోగం బుద్దిగా చేసుకోక ------"
"నాకు --నాకు ఏమి ------"నా మాట తడబడింది .కాళ్ళు చేతిలు వణికాయి .ఏ ఏ వో చెప్పాలని అనుకున్నాను .కానీ పెదవులు సహకరించటం లేదు .
"నా మాట నమ్మండి సార్ ." మెల్లగా గొణిగాను .
"ఏం నమ్మమండావు ?నీకు తేలేయకుండానే బంగారపు బేరింగ్ దానంతట అదే నడుచుకొని వెళ్లి నీ సంచిలో కూర్చుందా ?"
ఎం మాట్లాడగలను ?నా సంచిలో దొరికిన బేరింగ్ నేను దాచలేదని అంటే ఎవ్వరు నమ్ముతారు ?
       కర్మాగారంలోనియంత్రాలను బాగుచేసే పనిలో ఉన్నాము .పని వత్తిడివల్ల మధ్యాహ్న భోజనము పిదప సీటుకు వెళ్ళనే లేదు .సైరెన్ మోత విని టైం అయిపోయిందని ఆదరాబాదరాగా సీటు  దగ్గరకు వెళ్లి నా సంచి తగిలించుకొని బయులుదేరాను .ఎదురుగా నిలబడి వున్నారు మా జి.ఎం .గారు ,వొక్క రక్షక బటుడు .
  "మీ సంచి తనిఖీ చేయాలి ."
   " నా సంచీలో ఏం ఉంటాయి కంపెనీ వస్తువులు ? "
     "ఏమో --" మా జి .ఎం .అన్నారు ."ఏ పుట్టలో ఏ పాము వుందో ఎవ్వరికి ఎరుక ? "
      ఏమిటి ఈ హడావిడి సార్ ? "  సంచి రక్షక భటునికి అందిస్తూ అడిగాను .
   బంగారపు బేరింగ్ ఒకటి కనబటటం లేదు .ప్రతి ఒక్కరిని తనిఖి చేస్తున్నాము ."
   ఓ అదా సంగతి ?నేను తేలికగా నవ్వాను .
 ఇందులో ఉంది సార్ "గట్టిగా అరిచాడు రక్షక బటుడు  ఈ సంచిలో ఉంది " అతడు సంచిలోనుచి బేరింగ్ బయటికి తీసాడు
 నా గుండె ఆగిపోయినటు అనిపించింది .
 చూసావా ?" మా జి .ఎం .గారి కళ్ళు మెరిసాయి .ఎంత తెగింపు ?ఉద్యోగం ఇంకా కాయం అవనే లేదు ......."అతను ఒక్క నిమిషం ఆగారు .ఆ తరువాత అన్నారు . పద నా గదికి ."
 నాకు చెంప మీద కొట్టినట్టు అనిపించింది జి .ఎం గారి వెంట నడిచాను .
పచ్చిమాన అవమానబారంతో క్రుంగిపోయిన సూర్యుడు మబ్బుల గదిలో దూరాడు .


Thursday, July 26, 2012

SEETHA

                                                                   సీత
 ఆర్యపుత్రా , మీరు వెళ్లి రండి . సీత అంది .
 నువ్వూ వస్తావా ?అడవిలో రాళ్ళూ రప్పలూ ముళ్ళూ వుంటాయి .అయినా నేను వుంటానుగా ----స్వప్నాలు వర్షిస్తూ మనం కలసి ఉండవచ్చుగా .నువ్వు రా .
  ఏది నాలుగేళ్లే గా అరణ్యవాసం ? సీత చ్చేప్పింది   పర్వాలేదు .ఆ కాలం కొన్ని వీడియో సినిమాలు చూస్తూ గడిపేస్తాను . విసుగు ఉండదు .అందువల్ల ఆర్యపుత్రా వీడియో లైబ్రరీలో ఒక మెంబెర్షిప్ ఏర్పాటు చేయండిన కోసం .
  శ్రీరాముడు ముందుకు సాగాడు .
    కైకేయి కుర్చీ వద్ద కూర్చుని మంధర మళ్ళి నవ్వింది .
                                                                మలయాళ మూలం :  పారక్కడవు
                                                               తెలుగు సేత            : ఎల్ .ఆర్ .స్వామి .

--------------------------------------- చినుకు మాస పత్రిక  జూలై 2012 ---------------------------

Wednesday, July 25, 2012

khareethu

                                                                 ఖరీదు
            అతడు నాతో ఇలా అన్నాడు .శాఖాహారం తిని విసుగు వచినందువల్ల మేకమాంసం గురించి బయలుదేరాడట .మేకమాంసం అమ్మే దుకాణంలో అసలు రద్దీ లేదు .కానీ తన ఆరు నెలల జీతంకన్నా కిలో మాంసం ఖరీదు ఎక్కువట .అందువల్ల హతాసుడువై మాసం కొనకుండానే వెనక్కువస్తూ వుంటే రోడ్డుమీద ఒక గుంపు కనపడిందట .ఆసక్తితో జనాన్ని తోసుకుంటూ ముందుకు సాగాడు .ఎవ్వరో అతనికి ఒక పొట్లం ఇచ్చారు .ఆ పొట్లం పైన నెత్తుటి మరక ఉండటం గమనించి అది  మేక మంసమేనని అనుకున్నాడు అయినా తను అడగకుడానే ఎందుకు ఇచ్చారని ఆశ్చర్యబోయాడు .అదే మాట అడిగాడు
           అడగకపోయినా ఇస్తాం అని అన్నారు .డబ్బు ఇవ్వబోయాడు .
        ఎవ్వరికి కావాలిరా నీ డబ్బు ?బలే వచ్చాడొకడు
      తల దించుకుని పోట్లంతో ఇల్లు చేరాడు .ఆ రోజు మొదటిసారిగా మనిషిమాంసం తాలూకు రుచి తెలిసింది అతనికి .
                                                                    మలయాళ మూలం :పారక్కడవు
                                                                   తెలుగు సేత : ఎల్ .ఆర్.స్వామి
----------------------------- చినుకు మాసపత్రిక  జూలై  2012. -------------------------------------

kagitampadava

                                                          కాగితం పడవ
                                 ఆ రోజు నీ ఏడుపు ఆపడంకోసం కా గితంపడవ చేసి నీకిచ్కాను .అయినా నువ్వు ఏడుపు ఆపలేదు .
                          నాకు వాన కావాలి .వాన కురిపించు నువ్వు ఎడ్చావు .వానలో కాగితం పడవ వదలాలని పెచీపెట్టావు .
                         నేడు నువ్వు ఆ నాటి చిన్న పిల్లాడివి కాదు .నువ్వు ఏడవట మూ లేదు .అయినా నీ కళ్ళలోని అక్షరాలు ఇలా చెబుతున్నాయి .
                          నా నిట్టూర్పులు ఆవిరిగా ఫై కి  లేచి మబ్బులుగా గుమిగూడుతాయి                                                                             ఇప్పుడు కన్నీరు వర్షించి ప్రపంచం మునుగుతుంది ప్రళయం వస్తుంది .భాష లేని మాటలు ద్వారా నువ్వు అంటున్నావు ----ఈ జీవిత సాగరం దాటడానికి ఒక పడవ చేసి ఎయీ ఈయి .
                                                                         మలయాళ మూలం : పారక్కడవు
                                                                        తెలుగు సేత :   ఎల్ .ఆర్ .స్వామి .
------------------------------------ చినుకు మాస పత్రిక జూలై 2012.---------------------------

meedhavi

                                                              మేధావి 
                                                                           మలయాళ మూలం : పారక్కడవు
                                                                           తెలుగు సీత :  ఎల్.ఆర్ .స్వామి .
              ఇంటి వరండాలో కూర్చుని ఫ్రెంచ్ భాషలోని ఒక కవిత అనువాదం చేస్తున్నాడు రచయిత .
                  వాకిటిలో ఏదో అలికిడి ఆయనట్టు అనిపించి తలెత్తి చూసాడు .ఎదురుగా నిలబడి వున్నాడు ఒక ముష్టివాడు .పీకుకుపోయన మోము భుజం మీద బట్టల మూటతో --
                 అతన్ని ప్రస్నార్ధకంగా చూశాడు రచయిత 
           మూడు రోజులనుండి ఏదీ తినలేదయ్య .ఏదైనా వుంటే ---- అని నీరసంగా నసిగాడు ముష్టివాడు .
           వెంటనే రెండు కవితా సంపుటాలు ఇచ్చాడు రచయిత.సంపుటాల అట్టల మీద ఇలా రాసివుంది
          ఆకలితో అలమటించే మానవుడా పుస్తకం అందుకో .అదొక ఆయుధం .
            ముష్టివాడు వెంటనే అంగడిలో కి పరుగు తీసాడు .పుస్తకాలను తూకం వేసి అమ్మేసి ఆ డబ్బుతో టీ బన్ను కొనుక్కున్నాడు
----------------------------------- విపుల మొన్త్లీ  జూలై 2012 -----------------------------

Friday, January 20, 2012

నేను పిచ్చివాడిని

                                                                    నేను పిచ్చివాడిని 

నేనొక పిచ్చివాడిని 
స్నేహతత్వ మెరిగినా
స్నేహాన్ని స్నేహించే పిచ్చివాడిని
స్నేహం మోసగించ టానికి ఒక ఆయుధం
ఎదుటివాడిని ఓడించడానికి బ్రహ్మాస్త్రం
స్నేహమొక సన్నాయి
శ్రావ్య రాగాలు పలికే సన్నాయి
పిల్లలని గంగిరెద్దులుగా ఆడించటానికి
తల్లితండ్రులకదొక సన్నాయి
స్నేహమంటే  తోబుట్టువులకు 
నిరంతర సేవ
జీవిత భాగస్వామికి, స్నేహం
ఒక వంతెన,
ఇటు రాక కోసం
వాడని వంతెన ,
ఇమ్మనే నోటితోనే 
పొమ్మనే స్నేహం పిల్లలిది
నాకు తెలుసు 
స్నేహతత్వం ఇదేనని 
అయినా,
నేను స్నేహాన్ని స్నేహిస్తున్నాను
ఎందుకంటే 
స్నేహ పూర్ణిమ లేని బ్రతుకు
చమురు లేని భూగోళం 
అందుకే
నేనొక పిచ్చివాడిని
స్నేహ తత్వమెరిగినా
స్నేహాన్ని స్నేహించే పిచ్చివాడిని 
..........................................................ఎల్.ఆర్.స్వామి 


(2005 రామా కవితల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కవిత "చినుకు" జూలై 2007 లో ప్రచురితమైనది )