Friday, July 1, 2011

అడవి

అడవి 


అడవులు అంతరించి పోవటం లేదు 
నగరాలుగా విస్తరిస్తున్నాయి
పులుల సంఖ్య తగ్గనూ లేదు
అవి   నగరంలో, 
మానవ  వేషం వేసి తిరుగుతున్నాయి
పచ్చని జీవితాల
వెచ్చని నెత్తురు కోసం
పంజాలు విసురుతున్నాయి 
అడవిలోని పులికి 
నారా రక్తమిష్టం 
లేలేత లేడి పిల్లలంటే , ఇష్టం
నగరంలో పులికీ అంతే!
కానీ, నగరంలోని పులికి
గోళ్లు ఉండవు 
'బాంబు'లుంటాయి 
ఆసిడ్ బాటిల్స్ ఉంటాయి 
అనుచరుల పంజా ఉంటుంది,
ఇరాని తప్పిపోనివ్వదు 
నగరం ఒక అడవి
హైటెక్ అడవి
ఇక్కడ సుఖంగా బతకాలంటే 
పులి ఉండాలి, లేకపోతే
పులి దాసుడై ఉండాలి..


No comments:

Post a Comment