![]() |
ముగ్గు |
చిన్నప్పుడు ,
బాగా ముగ్గులు వేసేదాన్నట!
ఎన్ని చుక్కలనైనా
సులువుగా కలిపెదాన్నట
బహుమతులు కూడా వచ్చాయిట !
కానీ, ఇప్పుడు
ఇల్లాలి రంగు పులుముకున్నాక
మూడు చుక్కల్ని కలపలేకపోతున్నాను
చెరిపి చెరిపి గీసినా
రంగు మార్చి గీసినా
చుక్కలు కలవటం లేదు
చుక్కలు కలిస్తేగా
ముంగిట్లో రంగవల్లులు
బ్రతుకున సంక్రాంతి
ఆ పై ఉత్తరాయణం !!!
No comments:
Post a Comment