Friday, January 20, 2012

నేను పిచ్చివాడిని

                                                                    నేను పిచ్చివాడిని 

నేనొక పిచ్చివాడిని 
స్నేహతత్వ మెరిగినా
స్నేహాన్ని స్నేహించే పిచ్చివాడిని
స్నేహం మోసగించ టానికి ఒక ఆయుధం
ఎదుటివాడిని ఓడించడానికి బ్రహ్మాస్త్రం
స్నేహమొక సన్నాయి
శ్రావ్య రాగాలు పలికే సన్నాయి
పిల్లలని గంగిరెద్దులుగా ఆడించటానికి
తల్లితండ్రులకదొక సన్నాయి
స్నేహమంటే  తోబుట్టువులకు 
నిరంతర సేవ
జీవిత భాగస్వామికి, స్నేహం
ఒక వంతెన,
ఇటు రాక కోసం
వాడని వంతెన ,
ఇమ్మనే నోటితోనే 
పొమ్మనే స్నేహం పిల్లలిది
నాకు తెలుసు 
స్నేహతత్వం ఇదేనని 
అయినా,
నేను స్నేహాన్ని స్నేహిస్తున్నాను
ఎందుకంటే 
స్నేహ పూర్ణిమ లేని బ్రతుకు
చమురు లేని భూగోళం 
అందుకే
నేనొక పిచ్చివాడిని
స్నేహ తత్వమెరిగినా
స్నేహాన్ని స్నేహించే పిచ్చివాడిని 
..........................................................ఎల్.ఆర్.స్వామి 


(2005 రామా కవితల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కవిత "చినుకు" జూలై 2007 లో ప్రచురితమైనది )