l.r.swami.visakha
my short stories in Telugu, translations and my poems and much much more of me here....love l.r.swami
Wednesday, March 29, 2023
Tuesday, March 28, 2023
page 3
జ్ఞానపాన .
గురువర్యుని దయ వల్ల ఎప్పుడూ,
తిరునామములు మదిలో కదలనీ
ఎడబాటుకు తావునివ్వక మన
నర జన్మని సార్ధకం చేయనీ
నిన్నటి దాకా జరిగింది ఏమిటో
ఇక రేపు జరిగేవి ఏమిటో
ఏ క్షణాన జరుగునో నాశనం
ఈ క్షణాన కదిలేటి ఒంటికి
కనుల ముందర కదిలేటి వారిని
కనుల నుంచి చెరిపేది నీవే గా
రెండు నాలుగు దినాలలో ,మనిషిని
అందలాల పై తిప్పేది నీవే గా
మెడ మీద కులు కేటి వాడిని
పే ద భిక్షువుగా మార్చేది నీవే గా
ఇది చూసి చూసి గ్రహిస్తారు కొందరు
ఎన్ని చూసినా తెలుసుకోరు కొందరు
కనుల ముందర కదిలేది మొత్తము
కల్లయే నని తెలుస్కోరు ముందర
జనుల మనసులు మరువరాదులే
పలు రకాల,వి ,అపురూపములు!
పలు రకాల శాస్త్రముల పలుకులు
పలు రకాల మనుషుల కోసమే
నిత్యకర్మములు చేసెటి వారికై
కర్మ శాస్త్రములు ఉన్నాయి పలు రకం
జ్ఞాన దారిలో సాగేటి వారికి
జ్ఞానశాస్త్రములు ఉన్నాయి పలు రకం
సాంఖ్య శాస్త్రములు యోగాలు అన్నియు
లెక్క లేనన్ని ,ఉందనీ సర్వము
జీవితమనే రంగుల రాట్నంలో
గిరగిరమని తిరిగే మనిషికై
జీవితాన్నిఎరిగినోళ్ళు ఎందరో
పలికినారహో జీవిత సత్యాలు
చెవులు తిప్పండి ,వినుకోండి కొద్దిగా
ముక్తి అన్నది పొందండి అందరూ
మానసాన్ని బంధించి వున్నది ,కర్మ
బంధమే తెలుసుకోండి ముందర
కనుల ముందర విశ్వ మశేషము
మొత్తం కలసిన జ్యోతి స్వరూపమై
ఏదీ అంటని జ్యోతి స్వరూపమై
అన్నీ నిండిన సంపూర్ణ రూపమై
ఉన్నదోకటే నని నమ్మే ప్రజలకు
దీనినైనా నమ్మని వాళ్ళకు
దేనితోనూ పోల్చని వస్తువై
తుల్య వస్తువు లేకుండా ఒకటి వై
[TO BE CONTINUED]
PAGE -2
జ్ఞాన పాన [CONTINUED] :-
భక్త కవి [కొందరు మహాకవి అని కూడా సంబోధిస్తారు ]పూంధానం నంబూదిరి 16 వ శతాబ్దంలో ,మలయాళ భాషలో రచించిన లఘు భక్తి కావ్యం జ్ఞాన పాన .పాన అనేది మలయాళ భాషలోని ఒక్క ఛందస్సు .జ్ఞానం [అధ్యాత్మికజ్ఞానం ]గురించి ,పాన అనే ఛందస్సులో రచించిన కావ్యం జ్ఞాన పాన మలయాళ భక్తి సాహిత్యంలో, ఈ
కవికి ముఖ్యమైన,సుస్థిరమైన స్థానం ఉంది .కుమారాపహరణం ,భాషాకర్ణామృతం పార్థసారదీ స్తవం ,మొదలైనవి ఈ కవి తాలూకు ఇతర రచనలు .
అతి సరళమైన భాషలో ,అలంకారాల ప్రౌఢి ఎక్కువ లేకుండా ,ఈ కావ్యాన్ని రచించారు పూంధానం .అలనాటి వ్యావహారిక మలయాళ భాషలో లయ బద్ధంగా రచించారు .భక్తి భావం ప్రజల్లోకి వెళ్లాలనేది కవి ఉద్దేశ్యం .అనువాదం కూడా అంతే సరళంగా లయబద్దంగా ఉండడానికి వీలున్నంతవరకు ప్రయత్నించాను .ఈ భక్తి కావ్యాన్ని తెలుగులోకి అనువాదం చేయమని కోరిన చెన్నై అయ్యప్ప భక్త సమాజానికి ధన్యవాదాలు ---
ఎల్ .ఆర్ .స్వామి .
కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత;9949075859
ఎల్ .ఆర్ .స్వామి :- అనువాదకులు శ్రీ ఎల్ .ఆర్ .స్వామి కేరళ లో పుట్టి పెరిగి ,మలయాళం మాధ్యమం లో చదువుకున్న తమిళుడు .విద్యార్థి దశలో వున్నప్పుడు మలయాళం లో రచనలు చేసి బహుమతులు అందుకున్నవారు ఉద్యోగ రీత్యా విశాఖ వచ్చి స్థిరపడిన తరువాత ,స్వయంగా తెలుగు భాష నేర్చుకుని తెలుగు సాహిత్యం చదివారు .తెలుగులో 200 వరకు కధలు ప్రచురిత మైనాయి .బహుమతులు వచ్చాయి .6 కధా సంపుటాలు ప్రచురితమైనాయి .గత వందేళ్ల కాలంలో తెలుగులో వచ్చిన 100 మేటి కధలను ఎన్నుకున్నప్పుడు ఇతని కధ కూడా వాట్లో ఒకటిగా ఎన్నుకోబడింది 2015 లో తెలుగులోకి అనువాదం చేసినందుకు గాను కేంద్ర సాహిత్య అకాడెమీ వారి అనువాద పురస్కారం అందుకున్నారు .ఈ రోజుకి అంటే 28--3-2023నాటికి తెలుగులోకి 44 పుస్తకాలు మలయాళం లోకి తెలుగు నుంచి 20 పుస్తకాలు అనువాదం చేసేరు .విశాఖ లోని గీతం యూనివేర్సిటీ ఇతనికి గౌరవ డాక్టరేట్ [D.Lit] ఇచ్చి సత్కరించింది .ఇతని కధల మీద ఆంధ్ర యూనివేర్సిటీ లో విధ్యార్థి P.hd.మరియు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివేర్సిటీ లో M.Philపట్టాలు పుచ్చుకున్నారు
.
;
Tuesday, August 14, 2012
COLLEGUE ANTE
ఎ .సి .గదిలో కూర్చున్నా ,ముచ్చేమటలు పోసాయి నాకు .వంగి చేతిరుమాలుతో ముఖం వత్తుకొని తలెత్తి చూసాను .మా కర్మాగారంలో నిర్విరామంగా వెలిగే మంటకన్నా ఎర్రగా వున్నాయి మా జి .ఎం .గారి కళ్ళు ." ఛీ ఛీ ఎం పాడు పని చేసారండి"
జి .ఎం .విసుక్కున్నారు ."వచ్చిన ఉద్యోగం బుద్దిగా చేసుకోక ------"
"నాకు --నాకు ఏమి ------"నా మాట తడబడింది .కాళ్ళు చేతిలు వణికాయి .ఏ ఏ వో చెప్పాలని అనుకున్నాను .కానీ పెదవులు సహకరించటం లేదు .
"నా మాట నమ్మండి సార్ ." మెల్లగా గొణిగాను .
"ఏం నమ్మమండావు ?నీకు తేలేయకుండానే బంగారపు బేరింగ్ దానంతట అదే నడుచుకొని వెళ్లి నీ సంచిలో కూర్చుందా ?"
ఎం మాట్లాడగలను ?నా సంచిలో దొరికిన బేరింగ్ నేను దాచలేదని అంటే ఎవ్వరు నమ్ముతారు ?
కర్మాగారంలోనియంత్రాలను బాగుచేసే పనిలో ఉన్నాము .పని వత్తిడివల్ల మధ్యాహ్న భోజనము పిదప సీటుకు వెళ్ళనే లేదు .సైరెన్ మోత విని టైం అయిపోయిందని ఆదరాబాదరాగా సీటు దగ్గరకు వెళ్లి నా సంచి తగిలించుకొని బయులుదేరాను .ఎదురుగా నిలబడి వున్నారు మా జి.ఎం .గారు ,వొక్క రక్షక బటుడు .
"మీ సంచి తనిఖీ చేయాలి ."
" నా సంచీలో ఏం ఉంటాయి కంపెనీ వస్తువులు ? "
"ఏమో --" మా జి .ఎం .అన్నారు ."ఏ పుట్టలో ఏ పాము వుందో ఎవ్వరికి ఎరుక ? "
ఏమిటి ఈ హడావిడి సార్ ? " సంచి రక్షక భటునికి అందిస్తూ అడిగాను .
బంగారపు బేరింగ్ ఒకటి కనబటటం లేదు .ప్రతి ఒక్కరిని తనిఖి చేస్తున్నాము ."
ఓ అదా సంగతి ?నేను తేలికగా నవ్వాను .
ఇందులో ఉంది సార్ "గట్టిగా అరిచాడు రక్షక బటుడు ఈ సంచిలో ఉంది " అతడు సంచిలోనుచి బేరింగ్ బయటికి తీసాడు
నా గుండె ఆగిపోయినటు అనిపించింది .
చూసావా ?" మా జి .ఎం .గారి కళ్ళు మెరిసాయి .ఎంత తెగింపు ?ఉద్యోగం ఇంకా కాయం అవనే లేదు ......."అతను ఒక్క నిమిషం ఆగారు .ఆ తరువాత అన్నారు . పద నా గదికి ."
నాకు చెంప మీద కొట్టినట్టు అనిపించింది జి .ఎం గారి వెంట నడిచాను .
పచ్చిమాన అవమానబారంతో క్రుంగిపోయిన సూర్యుడు మబ్బుల గదిలో దూరాడు .
Thursday, July 26, 2012
SEETHA
ఆర్యపుత్రా , మీరు వెళ్లి రండి . సీత అంది .
నువ్వూ వస్తావా ?అడవిలో రాళ్ళూ రప్పలూ ముళ్ళూ వుంటాయి .అయినా నేను వుంటానుగా ----స్వప్నాలు వర్షిస్తూ మనం కలసి ఉండవచ్చుగా .నువ్వు రా .
ఏది నాలుగేళ్లే గా అరణ్యవాసం ? సీత చ్చేప్పింది పర్వాలేదు .ఆ కాలం కొన్ని వీడియో సినిమాలు చూస్తూ గడిపేస్తాను . విసుగు ఉండదు .అందువల్ల ఆర్యపుత్రా వీడియో లైబ్రరీలో ఒక మెంబెర్షిప్ ఏర్పాటు చేయండిన కోసం .
శ్రీరాముడు ముందుకు సాగాడు .
కైకేయి కుర్చీ వద్ద కూర్చుని మంధర మళ్ళి నవ్వింది .
మలయాళ మూలం : పారక్కడవు
తెలుగు సేత : ఎల్ .ఆర్ .స్వామి .
--------------------------------------- చినుకు మాస పత్రిక జూలై 2012 ---------------------------
Wednesday, July 25, 2012
khareethu
అతడు నాతో ఇలా అన్నాడు .శాఖాహారం తిని విసుగు వచినందువల్ల మేకమాంసం గురించి బయలుదేరాడట .మేకమాంసం అమ్మే దుకాణంలో అసలు రద్దీ లేదు .కానీ తన ఆరు నెలల జీతంకన్నా కిలో మాంసం ఖరీదు ఎక్కువట .అందువల్ల హతాసుడువై మాసం కొనకుండానే వెనక్కువస్తూ వుంటే రోడ్డుమీద ఒక గుంపు కనపడిందట .ఆసక్తితో జనాన్ని తోసుకుంటూ ముందుకు సాగాడు .ఎవ్వరో అతనికి ఒక పొట్లం ఇచ్చారు .ఆ పొట్లం పైన నెత్తుటి మరక ఉండటం గమనించి అది మేక మంసమేనని అనుకున్నాడు అయినా తను అడగకుడానే ఎందుకు ఇచ్చారని ఆశ్చర్యబోయాడు .అదే మాట అడిగాడు
అడగకపోయినా ఇస్తాం అని అన్నారు .డబ్బు ఇవ్వబోయాడు .
ఎవ్వరికి కావాలిరా నీ డబ్బు ?బలే వచ్చాడొకడు
తల దించుకుని పోట్లంతో ఇల్లు చేరాడు .ఆ రోజు మొదటిసారిగా మనిషిమాంసం తాలూకు రుచి తెలిసింది అతనికి .
మలయాళ మూలం :పారక్కడవు
తెలుగు సేత : ఎల్ .ఆర్.స్వామి
----------------------------- చినుకు మాసపత్రిక జూలై 2012. -------------------------------------